Tuesday, May 21, 2024

రష్యా విదేశాంగమంత్రి లావ్ రోవ్ తో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

Modi and Lavrov

 న్యూఢిల్లీ:   ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా భారత్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశమయ్యారు. వారిరువురు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. యూకె, చైనా, ఆస్ట్రియా, గ్రీస్ మరియు మెక్సికో నుండి వచ్చిన మంత్రులతో సహా గత రెండు వారాల్లో ఇతర పర్యటనకు వచ్చిన మంత్రులను ప్రధాని బహిరంగంగా కలవలేదు. ఈరోజు ప్రారంభంలో, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా ఒక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నట్లు లావ్రోవ్ చెప్పారు. ‘అధ్యక్షుడు (పుతిన్), ప్రధానమంత్రి నిరంతరం టచ్‌లో ఉన్నారు.  నా చర్చల గురించి నేను పుతిన్ కి  నివేదిస్తాను. ఆయన  ప్రధాని మోడీకి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ సందేశాన్ని  నేను మోడీకి వ్యక్తిగతంగా అందజేస్తున్నాను’ అని రష్యా విదేశాంగ మంత్రి విలేకరులకు చెప్పారు.

రష్యా నుంచి చమురు దిగుమతులు  చేసుకుంటున్న భారత్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్ పర్యటిస్తున్నారు.  మాస్కోపై అమెరికా విధించిన ఆంక్షలను అతిక్రమించేందుకు ప్రయత్నించే దేశాలకు మూల్యం తప్పదని అమెరికా ఇదివరకే హెచ్చరించింది. కాగా రాయితీతో కూడిన రష్యన్ చమురును భారతదేశం ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయగలదని నివేదికలు సూచిస్తున్నాయి , ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూబుల్-రూపాయి ఏర్పాటుపై రెండు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.

లావ్ రోవ్  రాకకు కొన్ని గంటల ముందు, అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్, మాస్కోకు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలను ‘పరిక్రమించడానికి లేదా తిరిగి పూరించడానికి’ (సర్కమ్వెంట్, బ్యాక్ ఫిల్) చురుకుగా ప్రయత్నిస్తున్న దేశాలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News