Sunday, April 28, 2024

నిష్పాక్షిక, సంఘటిత విద్యతోనే దేశం అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
PM Modi launch multiple key initiatives in education sector
విద్యారంగంలో ఐదు కీలక ఆవిష్కరణలను ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ : దేశంలో మన విద్యారంగం ప్రసంచ స్థాయిలో నాణ్యత సాధించాలంటే విద్యాబోధనఅభ్యాసప్రక్రియ నిరంతరం పునరిర్విచించబడడం, పునర్విధ రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ మంగళవారం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో ఐదు ఆవిష్కరణలను ప్రారంభించారు. భారతీయ సంకేత భాషా నిఘంటువు, టాకింగ్ బుక్స్, పాఠశాల నాణ్యత భరోసా, సిబిఎస్‌ఇ మదింపు నిబంధనావళి, నిష్ఠ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, విద్యాంజలి పోర్టల్‌లను మోడీ ఆవిష్కరించారు. ఏదేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘటితంగా ఉండాలని స్పష్టం చేశారు.

శిక్షక్ పర్వ్ కాంక్లేవ్ ప్రారంభం సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఈ ప్రమాణాల వల్ల ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేవిధంగా మన విద్యారంగం రూపొందడమే కాకుండా భవిష్యత్ కు తగినట్టు యువతను తయారు చేయడానికి దోహదపడుతుందని ప్రధాని దృఢ విశ్వాసం వెలిబుచ్చారు. కొవిడ్ సంక్షోభ సమయంలో మన విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొని తన సమర్థతను చాటుకుందని, ఆన్‌లైన్ క్లాసులు, గ్రూపు వీడియో కాల్స్, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించగలిగామని ఇవన్నీ ఇదివరకు మనం వినలేదని అన్నారు. విద్యారంగం సంఘటితం కాడానికి మన దేశంలో టాకింగ్ బుక్స్, ఆడియో బుక్స్‌ను కూడా విద్యలో భాగం చేశామని చెప్పారు.

యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్ (యుడియల్)ను ఆధారం చేసుకుని భారతీయ సంకేత భాషా నిఘంటువును అభివృద్ధి పరిచినట్టు తెలిపారు. ఇప్పటివరకు పాఠశాలలు, విద్య కోసం సాధారణ శాస్త్రీయ నిబంధనావళి మన దేశంలో లేదని, ఈ పరిస్థితి ఇప్పుడు మారిందని అన్నారు. నిష్ఠ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఉపాధ్యాయులు తమ సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోడానికి వీలవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో తమ క్రీడా ప్రతిభను చాటి యువతకు స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారు. విద్యార్థులు భవిష్యత్తులో క్రీడారంగాన్ని ఎంచుకునే విధంగా ప్రోత్సహించడానికి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 పాఠశాలలను సందర్శించాలని, ఒలింపియన్లు, పారాలింపియన్లను తాను కోరినట్టు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News