Tuesday, May 7, 2024

జమ్ముకశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

pm modi launched ayushman bharat scheme in J&K

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ నివాసితులందరికీ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఆరోగ్య కవరేజీని నిర్ధారిస్తుందని, ఆర్థిక ప్రమాద రక్షణను అందించడంతో పాటు వ్యక్తులు, వర్గాలకు అవసరమైన ఆరోగ్య సేవలను నిర్ధారించడంపై దృష్టి సారిస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా జమ్మూకశ్మీర్ నివాసితులందరికీ ఉచితంగా బీమా కల్పిస్తుందని పిఎంఓ తెలిపింది. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆర్థిక రక్షణ ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ద్వారా జమ్ముకశ్మీర్ లోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు.

pm modi launched ayushman bharat scheme in J&K

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News