Friday, May 3, 2024

ఈనెల చివరి వారంలో పిఎం కిసాన్‌నిధులు జమ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తున్నాయి. ఖరీఫ్ వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యాయి. పంటల సాగుకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలకు చర్యలు చేపట్టింది. ఈ నెల చివరివారంలో రైతుల ఖాతాలకు నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులు కూడా 14వ విడత పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 13 విడతలుగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. పిఎం కిసాన్ పథకం పరిధిలో ఉన్న రైతులకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఒక్కో విడతకు రూ.2వేలు వంతున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కోసం తప్పనిసరిగా ఈకెవైసిని చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News