Friday, May 3, 2024

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

PM Modi meeting with all states Chief Ministers

హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదించబడిన కరోరా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వురు వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి… కరోనా వైరస్ కూడా దేశమంతటిపైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజుల పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగితా వారికి ఇవ్వాలని సిఎం వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అన్ని ముఖ్యమంత్రులు, లెప్ట్ నెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సంరద్భంగా సిఎం కెసిఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా వారియర్స్ పోలీసులు, ఇతర సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బుతో భాదపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

PM Modi meeting with all states Chief Ministers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News