జిఎస్టి తగ్గడంతో స్వదేశీ వస్తువుల కొనుగోలుపై దృష్టి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
దేవీ నవరాత్రులు, జీఎస్టీ ఉత్సవ్ శుభాకాంక్షలు
ఆదాయపన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంపు
జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు డబుల్ బొనాంజా 2017లో జీఎస్టీ సంస్కరణలతోనే కొత్త చరిత్రకు శ్రీకారం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణల అమలు నేపథ్యంలో స్వదేశీ వస్తువుల వాడకం వైభవంగా సాగాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమలులోకి రానున్న తరుణంలో దేశప్రజల నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్, కొత్త చరిత్ర మొదలవుతున్నదన్నారు. జీఎస్టీ సంస్కరణ అమలుతో పాటే స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం మొదలు కావాలని ప్రధాని కోరారు. భారతదేశంలో తయారుచేసే ఉత్పత్తుల వైభవాన్ని పునరుద్ధరించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను కోరారు. జీఎస్టీ సంస్కరణల అమలువల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. ఈ మార్పులు దేశాభివృద్ధికి, కాష్ట్రాల అభివృద్ధికి, దోహదపడుతుందని, అటు ఉత్పత్తిదారులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని తెలిపారు. దేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన స్వదేశీ ఉద్యమం, దేశ శ్రేయస్సుకు బలాన్ని ఇస్తుందని, ఆత్మనిర్భర్ భారత్ కు ఊతం ఇస్తుందని ఆయన ఉద్భోధించారు. ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం స్వ దేశీ వస్తువులకు ఆలవాలం కావాలి. స్వదేశీ వస్తువులతోనే ప్రతి ఇల్లు, ప్రతి దుకాణాన్ని అలంకరించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను వార్షిక ఆదాయంపై రూ.12 లక్షలవరకు మినహాయించిన కొద్దినెలల్లోనే జిఎస్టీ సంస్కరణలు అమలు కావ డం డబుల్ బొనంజాగా ఆయన అభివర్ణించారు.
ఈ జంట నిర్ణయాల వల్ల పౌరులు రూ. 2.5 లక్ష ల కోట్లు ఆదా చేస్తారని ఆయన అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేసి, పెట్టుబడులకు అనుకూల వాతావరణా న్ని సృష్టించాలని ఆయన రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అప్పుడే స్వావలంబన సాకారం కాగలదన్నారు. భారతదేశంలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయ డం, లేదా అమ్మడం ప్రతి భారతీయుడి స్ఫూర్తి గా నిలవాలన్నారు. దీనివల్ల దేశాభివృద్ధి వేగవంతం కాగలదన్నారు. జీఎస్టీ రేట్ల సవరణ తమ ప్రభుత్వ నాగరిక్ దేవో భవః (పౌరులు దేవుళ్లతో సమానం) అనే మంత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఆరోగ్య రంగాలలో ఖర్చు తగ్గడంతో పాటు, నిత్వావసర వస్తువుల ధరలు తగ్గుతాయని మోదీ అన్నారు.
నవరాత్రి మొదటి రోజున, సోమవారం సూర్యోదయంతో, ఆత్మనిర్భర్ భారత్ కోసం ఒక ముఖ్యమైన అడుగు పడుతోంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తాయి. జీఎస్టీ ద్వా రా పొదుపు ఉత్సవం మొదలు కానున్నదని ప్ర ధాని మోదీ అన్నారు. జీఎస్టీ సంస్కరణల అమ లు సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పేదలు, మధ్యతరగతి మహిళలు, యువకులు, దుకాణదారులు, అమ్మకందారులు అందరూ ప్రయోజనం పొందుతారని ప్రధాని పునరుద్ఘాటించారు. 2017లో జీఎస్టీతో సంస్కరణల వైపు భారత్ అడుగులు వేసిందని, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. జీఎస్టీతో ఒకేదేశం, ఒకే పన్ను అన్న కలను సాకారం చేసిందన్నారు. భారతదేశ సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమలు స్వావలంబన దిశగా భారతదేశాన్ని నిర్మించడంతో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. దేశంలోనే వీలైనంత ఎక్కువగా ఉత్పత్తులు తయారు కావాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం జిఎస్టీలో కేవలం 5 శాతం, 18 శాతం పన్ను స్లాబ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. జనం రోజూ వాడే ఆహార పదార్థాలు, మందులు, సబ్బులు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఆరోగ్య, జీవిత భీమా వంటి అనేక వస్తువులు సేవలపై పన్ను తగ్గాయని, అసలు పన్ను లేకపోవడమో 5 శాతం పన్ను మాత్రమే చెల్లించే పరిస్థితి ఉండడమో ఉన్నాయన్నారు. గతంలో 12 శాతం పన్ను విధించిన వస్తువుల్లో దాదాపు 99 శాతం ఇప్పుడు 5 శాతం పన్ను పరిధిలోకి వస్తున్నాయన్నారు. వంటఇంట్లో ఉపయోగించే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ, చిన్న పరికరాలనుంచి ఆటోమొబైల్స్ వరకూ దాదాపు 375 వస్తువులపై తగ్గించిన జిఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ఇక చౌకగా వస్తువులు పొందవచ్చునని పేర్కొన్నారు. నెయ్యి. పన్నీర్, వెన్న, కెచప్, జామ్, డ్రై ప్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్ లు, తినుబండారు మరింత చౌకగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
Also Read: అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి: కోదండరాం