Sunday, April 28, 2024

కాలారం ఆలయంలో పిఎం మోడీ పూజలు..పరిసరాల పరిశుభ్రత

- Advertisement -
- Advertisement -

నాసిక్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాసిక్‌లోని ప్రసిద్ధ ప్రాచీన కాలారాం ఆలయంలో మాప్ పట్టి పరిసరాల పరిశుభ్రతకు దిగారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం ఆయన ముందుగా స్థానిక కాలారాం ఆలయంలో పూజలు నిర్వహించారు. సంత్ ఏక్‌నాథ్ విరచిత భావార్థ రామాయణం ప్రవచనాలను ఆలకించారు. భక్తులతో కలిసి చరణాలను పఠిస్తూ చిరుతల వాయిద్యానికి దిగారు. తరువాత ఆవరణలో జరిగిన స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఇక్కడ శ్రమదానం, రామాయణ పారాయణంలో పాల్గొన్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఆవరణలో ఊడ్చి, తరువాత శుభ్రం చేశారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట నేపధ్యంలో పౌరులంతా విధిగా ఆలయాల పరిశుభ్రత పనులలో పాల్గొనాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఇక్కడి కాలారాం ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. గతంలో మొఘలులు విధ్వంసంలో కూలిన ఆలయాన్ని 1700 సంవత్సరంలో పున ః నిర్మించారు. ఇక్కడి రాముడు కేవలం నిమిషంన్నరలో 14000 మంది రాక్షసులను సంహరించారనే కథ ఉంది. దానవుల అంతానికి పాల్పడిన ఈ రాముడికి తరువాత కాళారాముడు అనే పేరు వచ్చిందని చెపుతారు. నాసిక్‌కు రాముడికి అపూర్వ అనుబంధం ఉందని, శ్రీరాముడు ఎక్కువ కాలం ఇక్కడి పంచవటిలోనే గడిపారని వివరించారు దేశంలోని ప్రతి ఆలయం పరిశుభ్రంగా ఉండాలి. ఇందులో తాను కూడా ఓ పాత్ర వహించడం తనకు ఆనందం కల్గించిందని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News