Saturday, August 9, 2025

పుతిన్‌కు పిఎం మోడీ ఫోన్

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్‌లో సంభాషించుకున్నారు. భారత్‌పై అమెరికా ఎడాపెడా టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో వీరి నడుమ ఫోన్ చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి నడుమ ఉక్రెయిన్ పరిణామాలపై చర్చ జరిగినట్లు మోడీ, విదేశాంగ శాఖ ప్రకటన సష్టం చేస్తోంది. ‘నా స్నేహితుడు పుతిన్‌తో ఫోన్ సంభాషణ అద్భుతంగా సాగింది. ఇరువురం ఉక్రెయిన్ తాజా పరిణామాలపై చర్చించుకున్నాం. ఈ సందర్భంగా తాజా అంశాలను నాతో పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను.

అదే సమయంలో ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించా. దానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పా. అదే సమయంలో భారత్, రష్యా ద్వైపాక్షిక ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండు దేశాలు భావించాయి. కొనసాగుతున్న బంధాన్ని మరింత పటిష్టవంతం చేసుకునేందుకు నిబద్ధులమై ఉండాలని నిర్ణయించుకున్నాం. త్వరలో పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని భావిస్తున్నా. భారత్, రష్యా 23వ వార్షిక సదస్సు సందర్భంగా అది సాకారమవుతందని అనుకుంటున్నా’ అని ఎక్స్‌లో మోడీ తెలిపారు. విదేశాంగ శాఖ కూడా మోడీ, పుతిన్ ఫోన్ సంభాషణను ధ్రువీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News