Saturday, July 5, 2025

రేపు‘మిషన్ మౌసం’ను ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

భారత వాతావరణ శాఖ(ఐఎండి) 150వ స్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ‘మిషన్ మౌసం’ను ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్ భారత దేశాన్ని వాతావరణానికి సంసిద్ధంగా, అనుకూలమైన దేశంగా మలచనున్నది. ప్రధాని మోడీ అదే రోజున భారత్‌ను వాతావరణ స్థితిస్థాపకత, వాతావరణ మార్పులకు అనుగుణంగా మలచే ‘ఐఎండి విజన్-2047’ డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేయనున్నారు.

అది వాతావరణ ఫోర్‌కాస్ట్, వాతావరణ మేనేజ్‌మెంట్, వాతావరణ మార్పును తగ్గించడం వంటి వాటికి సంబంధించిన ప్రణాళికలు కలిగి ఉంటుందని ప్రధాన మంత్రి కార్యాలయం(పిఎంవో) తెలిపింది. భారత వాతావరణ శాఖ 150వ స్థాపక దినోత్సవం నాడు అనేక ఈవెంట్లు, కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. అంతేకాక ఐఎండి ఇప్పటి వరకు సాధించిన అంశాలను హైలైట్ చేయనున్నారు. భారత్ వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకునే దేశంగా మలచడంలో ప్రభుత్వ సంస్థ అయిన ఐఎండి పాత్రను ఎత్తిచూపనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News