Thursday, May 2, 2024

రేపు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

PM Modi to launch National Digital Health Mission tomorrow

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎండిహెచ్‌ఎం) సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించన్నునారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మోడీ 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్టును ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. జన్‌ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం రూపంలో నిర్మించిన పునాదుల ఆధారంగా పిఎండిహెచ్‌ఎంను అమలు చేస్తారు. విస్తృత స్థాయిలో డేటా, ఇన్ఫర్మేషన్, మౌలిక సౌకర్యాల కల్పన ద్వారా ఓ పటిష్టమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ప్రజల ఆరోగ్య సంబంధిత వ్యక్తిగత సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత, గోప్యత లభిస్తాయి. పిఎండిహెచ్‌ఎంలో భాగంగా ప్రతి పౌరునికి హెల్త్ ఐడిని ఇస్తారు. ఇది వారి హెల్త్ అకౌంట్‌గా ఉపయోగపడుతుంది. దీనికి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. ఓ మొబైల్ అప్లికేషన్ సహాయంతో వీటిని చూడవచ్చు. సంప్రదాయ, ఆధునిక ఔషధ రంగాల్లోని ఆరోగ్య సంరక్షణ సేవలను అందజేసేవారి రిజిస్ట్రీని నిర్వహిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీలను నిర్వహిస్తారు. డాక్టర్లు, ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేవారు తమ వ్యాపారాన్ని సులువుగా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News