Tuesday, April 30, 2024

బాలుడి కిడ్నాప్.. 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

TS-Police

హైదరాబాద్: బాలుడి కిడ్నాప్ కేసును నగర పోలీసులు ఇర వై నాలుగు గంటల్లో చేదించారు. భిక్షాటన చేసుకుని కుమారుడిని పోషించుకుంటున్న రోహిణి తన బాలుడు(18నెలలు) చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షాటన చేస్తూ కుమారుడిని పోషించుకుంటోంది. రోజులాగే భిక్షాటన చేసుకుని బుధవారం రాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రించింది.

తెల్లవారుజామున లేచిచూసేసరికి బాలుడు కన్పించలేదు. వెంటనే చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎడిసిపి చక్రవర్తి గుమ్మి ఆదేశాలతో రంగంలోకి దిగారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తి బాలుడిని ఎత్తుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అతగు పాతబస్తీ, తలాబ్ కట్టకు చెందిన వాడిగా గుర్తించారు.

అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా తమకు పిల్లలు లేరని బాలుడిని పెంచుకునేందుకు తీసుకువెళ్లినట్లు ఒప్పుకున్నాడు. గంటల వ్యవధిలోనే చిన్నారి ఆచూకీ తెలుసుకుని తల్లిచెంతకు చేర్చడంతో రోహిణి ఆనందం వ్యక్తం చేసింది. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డిసిపి చక్రవర్తి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై గోవింద్‌స్వామి, కానిస్టేబుళ్లు నిందితుడిని పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News