Friday, May 3, 2024

ప్రచారం.. పరుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల ను ఉధృతం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, వివిధ పార్టీల ము ఖ్యనేతలు ఇప్పటికే దాఖలు చేయడంతో పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచాయి. వా డవాడకు అన్ని పార్టీల అభ్యర్థులు పర్యటిస్తున్నా రు.తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కో రుతున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ పరస్పరం వి మర్శలకు దిగుతున్నారు. ప్రధాన పార్టీలైన కాం గ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొం ది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు కేవలం 20 రో జులు మాత్రమే సమయంలో ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. త మదైన వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రచార రథాలను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు పార్టీ ముఖ్యనాయకులతో త రచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుం చి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి.

తమ పార్టీ పై ఇతర పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. గ్యారంటీలను కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, హామీల అమలులో విఫలమయ్యారంటూ బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కేంద్రంలో మళ్లీ తమదే అధికారం అనే నమ్మకంతో ఉన్న క మలం నేతలు మరోసారిమోడీ ప్రధాని ఖాయమం టూ వివరిస్తున్నారు.తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మం త్రులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్లమెం టు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 17 స్థానాలకు కనీసం 14 స్థానాలైన చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వే స్తోం ది. నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహి స్తూ, పార్టీ గెలుపునకు కృషి చేయాలని క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

పెంచే దిశలో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలనాపరమైన అంశాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని సిఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ కేడర్‌లో భరోసా విశ్వాసం కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా అవసరమన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. భువనగిరి లోక్‌సభ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

డబుల్ డిజిట్ లక్షంగా ముందుకెళుతున్న కమలనాథులు
కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బిజెపి, తెలంగాణలో బిజెపికి సానుకూల వాతావరణం ఉందని భావిస్తూ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్షంగా పార్టీ అగ్రనేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలు చేస్తూ కమలం పార్టీ ముందుకెళుతోంది. బిజెపి పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాలలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేసిన మోదీ సర్కార్‌ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి అగ్రనేతలు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ప్రచార కార్యక్రమాల్లో స్పీడ్ పెంచిన కారు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్‌ఎస్ పార్టీ తమ ప్రచార కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించగా, ఈ నెల 24 నుంచి పార్టీ అధినేత కెసిఆర్ 17 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టనున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు పొందిన లబ్దిదారులు, గ్రామస్థాయి నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని బిఆర్‌ఎస్ అగ్రనాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News