Sunday, April 28, 2024

వరిసాగుతో కాలుష్యం రెట్టింపు

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మొత్తం మీద నీటి తడిలేని కాలంలో ఎక్కువగా వరిసాగు పొలాలకు నీరు పెట్టి తడుపుతుంటారు. ఇదే హరిత వాయువులు విపరీతంగా వెలువడి భూతాపాన్ని పెంచడానికి అవకాశం కల్పిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో సగానికి సగం జనాభా దాదాపు 7 బిలియన్ మందికి వరిపంటే ఆహార పంటగా వినియోగమవుతోంది. అయితే ఈ సాగు విధానమే భూతాప వాతావరణంపై ప్రభావం చూపుతోందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నివేదిక వివరించింది. పరిశోధకులు ఈ వరిపొలాల నుంచి నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువగా వెలువడడాన్ని గమనించారు.

మెథేన్ లేదా కార్బన్‌డైయాక్సైడ్ కన్నా నైట్రస్ ఆక్సైడ్ వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందని తెలుసుకున్నారు. పొలాలు తడిపే ముందు ఎండి ఉన్న పొలాల నుంచి నైట్రస్ ఆక్సైడ్ వెలువడుతుంది. ఈ ప్రక్రియలో పొలాలను అప్పుడప్పుడు తడపటం జరుగుతుంటుంది. అమెరికా ఎన్విరాన్‌మెంటల్ డిఫెన్స్ ఫండ్ (ఇడిఎఫ్ ) విశ్లేషణ ప్రకారం మెథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు వరి పొలాల నుంచి వెలువడడం 600 బొగ్గు క్షేత్రాల నుంచి వెలువడే కర్బన వాయువులతో సమానమని వెల్లడైంది. ఇంతవరకు పొలాలు తడపడం వల్ల వచ్చే నైట్రస్ ఆక్సైడ్ గురించి సరిగ్గా అధ్యయనం జరగలేదని ఇడిఎఫ్‌కు చెందిన శాస్త్రవేత్త వ్రిటీవ్రిటీ పేర్కొన్నారు. దక్షిణ భారతంలో వరి పొలాల నుంచి వెలువడే హరిత వాయువుపై ఈ అధ్యయనం జరిగింది. వాతావరణంపై 99 శాతం కాలుష్య ప్రభావం నైట్రస్ ఆక్సైడ్ వల్లనే అని గ్రహించారు.

భారత్, చైనా, ఇండోనేసియా, వియత్నాం, బంగ్లాదేశ్, దేశాలు ఎక్కువగా వరిని పండిస్తుంటాయి. ఈ హరిత వాయువుల ప్రభావం ఇదివరకు 10 శాతం మాత్రమే వాతావరణంపై ఉంటుందని అనుకున్నా ఇప్పుడు అంతకు మించి 90 శాతం వరకు వీటి ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు వివరించారు. నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువుల విధానం మెథేన్ ఉద్గారాలను తగ్గిస్తుండగా, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను పెంచుతున్నాయి. వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్ సుదీర్ఘకాలంగా మసలే హరితవాయువు. వాతావరణంలో మెథేన్ కన్నా ఎక్కువగా వేడిని కలిగిస్తుంది. ఈ రెండు వాయువులూ 20 నుంచి 100 సంవత్సరాల పాటు వేడిని గ్రహిస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News