Sunday, April 28, 2024

మెతుకు సీమలో ప్రగతి శంఖారావం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మెతుకు సీమ గడ్డమీద నుంచి ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వస్తున్నామంటూ ముఖ్యమం త్రి కెసిఆర్ ప్రగతి శంఖరావాన్ని పూరించనున్నట్లు మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలియజేశారు. నేడు మెదక్ జిల్లాలోకి ప్రవేశించగానే ముఖ్యమంత్రికి పటాన్‌చెరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్‌రెడ్డి గుమ్మడిదల వద్ద ఘన స్వాగతం పలుకనున్నారని తెలిపా రు. జిల్లాకు విచ్చేసిన ఆయన ముందుగా 1 గంటకు బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం అనంతరం ఎస్పీ కార్యాలయంతోపాటు, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు వె ల్లడించారు.

ఈ సందర్భంగా మెదక్ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం అ క్కడే వికలాంగులకు పెంచిన 4016 రూపాయల పెన్షన్‌ను పంపిణీని ప్రారంభిస్తారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సకాలంలో ఆయా ఎమ్మెల్యేలు వికలాంగుల పింఛన్లను 4016 రూపాయలకు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల వికలాంగులకు లబ్ధ్ది చేకూరనుందని అన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బిడి కార్మికులు ఉన్నారని ఏ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రం బిడి కార్మికులకు పింఛన్‌ను ఎప్పటినుంచో అందజేస్తుందని తెలియజేస్తూ వీరికి అనుసంధానంగా పనిచేస్తున, ప్యాకర్లకు కూడా పింఛన్‌ను మంజూరు చేస్తున్నట్లు మెదక్ నుంచి ప్రకటించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతారని అన్నారు. అనంతరం 3:30 గంటలకు సిఎస్‌ఐ అవరణలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి పాల్గొని ప్రగతి శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలియజేశారు.

కేవలం మొదటి విడతలోనే 115మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత మొట్టమొదటి సభలో ముఖ్యమంత్రి మాట్లాడనున్నట్లు తెలిపారు. మొదటి జాబితా విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణుల్లో సంబరాలు క్యాడర్‌లో ఉత్సాహం నింపిందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పది స్థానాలను గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా అందజేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి క్యాడర్, కాంగ్రెస్‌కు క్యాండెట్ల్లు లేరని ఎద్దేవా చేశారు. బిజెపి డీలా… కాంగ్రెస్ ఉత్త్తుత్తి గోల తప్ప ప్రజలకు చేసిందేమీలేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో బిఆర్‌ఎస్ రావాలని తెలిపారు. విశ్వకర్మలకు బిసి కార్పొరేషన్ ద్వారా ఉచితంగా లక్షఅందజేస్తే కేంద్రం కాపీ కొట్టి అప్పు రూపంలో ఇస్తుందన్నారు. దుష్ప్రచారంతో ప్రజల మనస్సును గెలుచుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, పేరుకే జిల్లాగా ఉన్న మెదక్‌ను జిల్లా కేంద్రంగా మార్చిన ఘనత కెసిఆర్‌దేనన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి తదితరులు పాల్గొన్నారు.
సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయం, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్వయంగా తానే దగ్గరుండి స్థానిక శాసనసభ్యురాలితో కలిసి పనుల పురోగతిని, ఏర్పాట్ల వ్యవహారాలను సమీక్షించారు. ఈ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం సిఎస్‌ఐ గ్రౌండ్‌లోని నిర్వహించే బారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నట్లు తెలిపారు. ఈ సభకు దాదాపు లక్షకు పైగా ప్రజలు విచ్చేయనున్నారని అందుకు సంబందించిన పూర్తి ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ రాజర్షి షాను ఆదేశించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన స్థలాలను ఎంపిక చేసి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సభా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 21 మండలాల ప్రజలు హాజరు కానున్నారని, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి ఎటువంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంగళవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంతోపాటు సభా నిర్వహణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బందోబస్తు విషయంలో పోలీసులు అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News