Wednesday, May 8, 2024

వైద్యులపై దాడి చేస్తే 7ఏళ్ల వరకు జైలు శిక్ష: ప్రకాశ్ జవదేకర్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ప్రభావం, దేశ ఆర్థిక పరిస్థితి, తదుపరి చర్యలపై కేంద్ర కేబినేట్ సమీక్షించింది. ఈ సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్యుల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నాము. కరోనా విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా అందిస్తాం. వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కేసు తీవ్రతను బట్టీ 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.  వైద్యులపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతోపాటు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. కోవిడ్ బాధితులకు ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందిస్తున్నాం. కిష్టమైన సమయంలో వైద్యులు, ఆశా వర్కర్లు, పారిశుధ్య సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎరువులపై రాయితీ కోసం రూ.22,186 కోట్లు కేటాయిస్తున్నాం. కరోనాపై పోరు కోసం రూ.15వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు ఉన్న టెస్టు కిట్లనే కొనుగోలు చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.

Prakash Javadekar speaks to media over attack on Doctors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News