Saturday, April 27, 2024

కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Hight Court

 

హైదరాబాద్: మహమ్మారి కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది తిరుమలరావు వ్యాజ్యలంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారించింది. అందరికి పరీక్షలు చేయలేకపోతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని న్యాయవాది కోర్టుకు వివరించారు. రాష్ట్రంలో కరోనా తగ్గొచ్చొ, పెరగవచ్చు.. ఇప్పుడే ఊహించలేమని కోర్టు పేర్కొంది. కరోనా పరీక్షలు ఎవరికి చేస్తున్నారో మే 13లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ వేళ దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని.. దివ్యాంగులకు, వారి సహాయకులకు సాస్ లు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. నిత్యావసరాలు, ఔషదాలను దివ్యాంగుల ఇళ్లకు సరఫర చేయాలని ఆదేశించింది. సేవాభావం ఉన్న ఎన్ జీఓలు, కార్పోరేట్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో దివ్యాంగులకు అత్యవసర చికిత్సలకు ప్రాధాన్యతనివ్వాలని, దివ్యాంగుల వివారాలు సేకరించి వారి బాగోగులు చూసుకోవాలని చెప్పింది. కరోనా నేపథ్యంలో ఏం చర్యలు తీసుకున్నారో మే 8లోపు ప్రభుత్వం నివేదికను సమర్పించాలని కోర్టు పేర్కొంది.

High Court Orders TS Govt to Give Report on Corona Tests

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News