Thursday, May 2, 2024

అప్రమత్తతే శ్రీరామ రక్ష

- Advertisement -
- Advertisement -

Precautions during firing Fireworks

 

దీపావళి సందర్భంగా విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి

మన తెలంగాణ, హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు పలుజాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి చెబుతున్నారు. టపాసులను నాణ్యమైనవి ఎంపిక చేసుకోవడంతో పాటు, లైసెన్స్‌లు కలిగిన డీలర్ల వద్దనే కోనుగోలు చేయాలంటున్నారు. బాణా సంచా పేల్చడానికి ముందు ఆయా ప్యాకింగ్‌పై ఉండే సేఫ్టీ సూచనలు తప్పకుండా చదవాలని సూచిస్తున్నారు. మంటలు అంటుకునే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలని, చెట్లు, ఎండుగడ్డిలాంటి ఉన్న ప్రాంతాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలని ఎందుకుంట అటువంటి ప్రాంతాల్లో వాటిని పేల్చడం ద్వారా అగ్నిప్రమాదం జరిగే అవకాశం అధికంగా ఉందని చెబుతున్నారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండి వారితో కాల్పించడం మంచిదంటున్నారు. బాణాసంచా కాల్చేసమయంలో చేతులు ,ముఖాన్ని టపాసులకు దూరంగా ఉంచి ఒత్తిని జాగ్రత్తగా అంటించాలని చెబుతున్నారు.

కాల్చిన బాణా సంచా సామాగ్రిపై ఇసుక పోయడంతో పాటు ప్లాస్టిక్ బకెట్లతో కప్పి ఉంచాలని తద్వారా ఆ దారిగుండా వెళ్ళే వారికి ప్రమాదం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. టపాసులు కాల్చేముందు బకెట్‌నీటిని సిద్దంగా ఉంచుకోవాడమే కాకుండా అనుకోకుండా ఏదైన ప్రమాదం సంభవిస్తే సమీపంలోని ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌చేయాలన్నారు. సమీపంలోని వాహనాలపై కవర్లు వేసి ఉంచాలని,పండుగ సమయంలో వాహానాలను వీలైనంత వరకు ఇంటిలోపలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. నిప్పు రవ్వలు పడి చిన్న చిన్న గాయాలు ఏర్పడితే సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, ఆయోడిన్,డెటాల్‌తో కూడిన ఫస్ట్‌ఐడి కిట్‌ను సిద్దంగా ఉంచుకోవాలంటున్నారు. టపాసులు కాల్చేప్రదేశం సరైనదై ఉండాలని, రోడ్డు మధ్యల లేదంటే ఇంటిలోపల కాని గుంపులు ఉన్న చోట కానీ టపాసులు కాల్చవద్దని చెబుతున్నారు. టపాసలు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులు కళ్ళు, నోటిలో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి ముందులను ( క్రాకర్స్‌ను ,మతాబులు ) విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా కాల్చాలని చెబుతున్నారు. భవనాలను దీపాలతో అలంకరించే ముందు ఆయా భవానాలకు ఆనుకుని ఏవైనా హైటెన్షన్ల వైర్లు గాని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లుకాని దగ్గరగా ఉన్నాయోలేదో ఒక సారిసరి చూసుకోవాలని చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News