Sunday, May 5, 2024

మౌనం వీడిన చైనా

- Advertisement -
- Advertisement -

China Greetings to Biden and Harris

 

బైడెన్, హారిస్‌లకు శుభాకాంక్షలు..!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పట్ల చైనా మౌనం వీడింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహారిస్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ‘అమెరికా ప్రజల ఎంపికను మేం గౌరవిస్తున్నాం. బైడెన్, కమలాహారిస్‌కు మా శుభాకాంక్షలు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని అమెరికా చట్టాల ప్రకారం ధ్రువీకరిస్తారని భావిస్తున్నాం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఎన్నిక కావడంపైనా వాంగ్ వ్యాఖ్యానించారు. ‘చైనాలో ఆకాశంలో సగం మహిళలు అన్న సూక్తి ఉన్నది. లింగ సమానత్వానికి చైనా కట్టుబడి ఉన్నది. ప్రపంచంలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తాం’ అని వాంగ్ పేర్కొన్నారు.

బైడెన్ గెలుపును అనేక దేశాలు అంగీకరించినా, కొన్ని దేశాలు వెనకాడాయి. వారం రోజుల తర్వాత చైనా మౌనం వీడింది. రష్యా, బ్రెజిల్, టర్కీ, మెక్సికో దేశాధినేతలు ఇంకా స్పందించలేదు. ట్రంప్ హయాంలో అమెరికా,చైనా సంబంధాల్లో అనుమానాలు పొడచూపాయి. చైనా నుంచి కొవిడ్19 వ్యాప్తి జరిగిన తీరుపై ట్రంప్ పలుమార్లు ఆగ్రహం
వ్యక్తం చేశారు. చైనా పట్ల బైడెన్ విధానపర నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News