Monday, August 11, 2025

బాలింతను భుజాలపై మోసుకెళ్లిన అంబులెన్స్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

ఏళ్లు గడిచిన తప్పని కాలి నడక ప్రయాణం.. కాలి నడకకు వెళ్లేందుకు గగణంగా మారుమూల తండాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. 75ఏళ్ల స్వాతంత్రంలో అభివృద్ధి మట్టి రహదారినేనని చెప్పవచ్చు. దేశంలో తెలంగాణ రాష్ట్టం అభివృద్ద్ధిలోనెంబర్ వన్ గా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నా అంబులెన్స్ వెళ్లని దుస్థితి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం శాంతినగర్ తండా పరిధిలోని మున్యా నాయక్ తండాకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు లేని తండా.. ఆపై వర్షం.. బాలింతను అంబులెన్స్ వరకు వీపుపై ఈఎంటి మోసిన దీనస్థిథి ఇది. మున్యానాయక్ తండాకు చెందిన కౌశిబాయి ప్రసవానికి ఆదివారం 108కు కాల్ చేయగా అంబులెన్స్ వచ్చింది.

కాని సదరు గర్భిణి తండాకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో 108 అంబులెన్స్ ఈఎంటి సంగిశెట్టి గర్భిణి ఇంటి వద్దకు వెళ్లే సరికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ వద్దకు ఈఎంటీ తన వీపుపై మోసుకెళ్లాడు. కాగా ఈవిషయం నియోజకవర్గంతోపాటు పలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో పలువురు మనస్సులను కలిచివేసింది. కాగా సంగిశెట్టి తన విధులను నిర్వహిస్తున్న తీరుతోపాటు మావనత దృక్పథంలో తన భూజాలపై మోసుకెళ్లడంపై పలువురు అభినందించారు. ఇప్పటికైనా మున్యానాయక్ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News