Wednesday, May 8, 2024

నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

Mukesh-Singh

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాచార దోషి ముకేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముకేష్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతి భవన్‌కు సిఫార్సు చేసిన కొద్ది గంటల్లోనే రాష్ట్రపతి ముకేష్ సింగ్‌కు క్షమాభిక్షను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 22న మరో ముగ్గురు దోషులతో కలసి ముకేష్ సింగ్‌కు ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ముకేష్ రాష్ట్రపతికి చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి నిర్ణయాన్ని తీహార్ జైలు అధికారులకు రాష్ట్రపతి భవన్ తెలియచేసింది.

President rejects mercy petition of Mukesh Singh, the Delhi governemnt has recommended the Centre to reject the mercy petition of one of four convicts in Nirbhaya rape case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News