Thursday, August 7, 2025

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్గాలన్నింటిని ప్రయత్నించాం: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు పోరాడుతామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో సిఎం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం సాయంత్రం వరకు వేచి చూస్తామని, రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రపతి సమయం ఇవ్వలేదంటే ప్రధాని నరేంద్రమోడీ ఒత్తిడి చేస్తునట్లు భావించాల్సి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు.  42 శాతం రిజర్వేషన్ల అమలుకు (Implementation 42 percent reservations) ఉన్న మార్గాలన్నింటిని ప్రయత్నించామని అన్నారు. కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, బిసి రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నాయని తెలియజేశారు. 50 శాతం సీలింగ్ పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జివో ఇవ్వాలని, జివో ఇస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు చెప్పినట్టే సెప్టెంబరు 30 లోపు స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News