Saturday, May 4, 2024

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ నేడు హైదరాబాద్ రానున్నారు. అందులో భా గంగా వందేభారత్ రైలును, 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను, రూ.7,864 కోట్లతో 6 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన, బీబీనగర్ ఎయిమ్స్, అత్యాధునిక వసతుల కల్పనకు మోడీ భూమి పూజ చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని అక్క డి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. నేడు ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర ధాని చేరుకుంటారు.

అక్కడినుంచి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకొని వందేభారత్ రైలును ప్రారంభిం చి, రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు సికింద్రాబాద్ పేరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ రహదారులకు శంకుస్థాపన చే సిన అనంతరం మధ్యాహ్నం 12.50 నిమిషాల నుంచి 1.20 నిమిషాల వరకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఆ సభ మొదలుకాగానే బీబీనగర్‌లో రూ.1326 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. సికింద్రాబాద్- టు మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ డబ్లింగ్, విద్యుదీకరణను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రూ 1,410 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును దాదాపు రూ. 85.24 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో 9 ప్రధాన వంతెనలు, 152 చిన్న వంతెనలు, రహదారి వినియోగదారుల భద్రత, రైలు నిర్వహణ కోసం 17 లెవెల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల ప్యాసింజర్, ఫ్రైట్ రైళ్లు రెండింటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో స్టేషన్ పునః నిర్మాణం

రూ. 720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ప్రయాణికుల రాకపోకల పరంగా అతిపెద్ద స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పునః నిర్మిస్తు న్నారు. ఇందులో భాగంగా స్టేషన్ భవనానికి భారీ ఎత్తున మార్పులు చేస్తున్నారు. ఈ స్టేషన్‌లో విశాలమైన డబుల్-లెవల్ రూఫ్ ప్లాజా తో పాటు రిటైల్ షాపులు , ఫలహార శాలలు, వినోద సౌకర్యాలు, ప్రయాణికుల రాక, నిష్క్రమణలకు వేర్వేరుగా, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, ట్రావెలేటర్‌లు, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి ఎన్నో సౌకర్యాలతో పాటు రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులకు అంతరాయం లేకుండా ఇతర రవాణా మార్గాలతో మల్టీమోడల్ కనెక్టివిటీని నిర్మిస్తున్నారు. రాబోయే 40 సంవత్సరాలకు అనుగుణంగా స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారు. విమానాశ్రయాన్ని తలపించేలా ఆధునిక వసతులు, అబ్బురపరిచే హంగులను కల్పించనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ గతంలోనే టెండర్లకు పిలవగా మొత్తం 8 సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు ఢిల్లీకి చెందిన గిరిధర్లాల్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్‌ను దక్కించుకుంది.

ఈ స్టేషన్ నుంచి నిత్యం సగటున 200 రైళ్లు

దేశంలోనే ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సగటున 200 రైళ్లు నడుస్తుంటాయి. 1.80 లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. రోజురోజుకూ పెరుగుతోన్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. స్టేషన్‌ను ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై పలు నమూనా డిజైన్లను రూపొందించింది. ఈ మేరకు ఢిల్లీ సంస్థ స్టేషన్‌లా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. స్టేషన్‌లో కొత్తగా చేపట్టనున్న పనులతో పాటు స్టేషన్ ఉత్తరాన 5 అంతస్తుల్లో మల్టీ లెవల్ పార్కింగ్ దక్షిణాన భూగర్భ పార్కింగ్ వసతులు రానున్నాయి. ఉత్తర, దక్షిణ దిశల్లో జీ+3 అంతస్తులతో భవనాలను నిర్మించనున్నారు. 108 మీటర్ల ఎత్తుతో రెండు అంతస్తుల ‘స్కై కాన్కోర్స్’ నిర్మాణం జరగనుంది. అందులో మొదటి అంతస్తు ప్రయాణికుల కోసం కాగా రెండో అంతస్తు ఫ్లోర్ రూప్టాప్ ప్లాజాగా నిర్మాణం జరుగుతుంది.

5 వేల కిలో వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్

ప్రస్తుతం స్టేషన్‌లో ట్రాక్‌లపై ఎలాంటి నిర్మాణాలు లేవు. తాజా ప్రణాళిక ప్రకారం కింద రైల్వే ట్రాక్‌లు ఉంటే వాటిపై భవనాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తర, దక్షిణ భవనాలకు రెండు వైపులా ట్రావెలేటర్‌తో పాటు రెండు నడక మార్గాలు నిర్మిస్తున్నారు. నేలపై ఉండి వీటి మీద నిల్చుంటే అవే ముందుకు తీసుకెళ్లేలా వీటిని నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేయనున్నారు. రైలు దిగిన ప్రయాణికులు ఎస్కలేటర్ ద్వారా నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. వీటితో పాటు 5 వేల కిలో వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News