Sunday, April 28, 2024

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

ధర్మారం: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని నాలుగు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శ్రీకారం చుట్టారు. నంది మేడారం గ్రామంలో రూ.45 లక్షలతో మంజూరైన 24 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేయనున్న 50 సైడ లైట్లకు భూమి పూజ చేశారు. దొంగతుర్తి గ్రామం నుండి కుమ్మరికుంట వరకు నాలుగు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రచ్చపల్లి, రామయ్యపల్లి గ్రామాల్లో పలు సీసీ రోడ్లను ప్రారంభించడంతోపాటు నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు.

దొంగతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, పల్లె సీమలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందడంలో ప్రభుత్వ కృషి ఎంతో ఉందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ సేవలను గుర్తించాలని మంత్రి ఈశ్వర్ కోరారు.

గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వం నిర్విరామ కృషి చేసిందని, మూడోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గుర్తించి అధికారంలోకి తీసుకురావాలని మంత్రి కోరారు. ఇందుకోసం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జిల్లా సహకార సంఘాల చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా కోఆప్షన్ నలామోద్దీన్, మండల కోఆప్షన్ రఫీ, రైతుబందు మండల అధ్యక్షుడు పాకాల రాజన్న గౌడ్, జిల్లా రైతుబంధు సభ్యులు పూసుకూరు రామారావు, ఎగ్గేల స్వామి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మంద శ్రీనివాస్, మేడారం, దొంగతుర్తి, రచ్చపల్లి సర్పంచ్‌లు సామంతుల జానకి, ముత్యాల చంద్రశేఖర్, మొర సుధాకర్, దొంగతుర్తి ఎంపీటీసీ దాడి సదయ్య, రచ్చపల్లి ఎంపీటీసీ బేల్లల రోజారాణి, దొంగతుర్తి, మేడారం ఉపసర్పంచ్‌లు మూదం శ్రావణ్ కుమార్, కట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News