Tuesday, April 30, 2024

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తాం

- Advertisement -
- Advertisement -

Priority will be given to health care of sanitation workers

రూ. 10. కోట్ల విలువ చేసే
పీపీకిట్‌లను అందచేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మీ

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో పని చేసే పారిశుద్య కార్మికుల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు. జిహెచ్‌ఎంసిలోని 20775 పారిశుధ్యకార్మికులకు ఆమె బుధవారం ఉదయం పిపిఈ కిట్‌లను అందచేశారు. ఒకొక్క పిపిఈ కిట్‌లో మాస్కులు, క్యాప్, బూట్లు,టవల్స్ ,కొబ్బరి నూనే ,చేతి గ్లౌస్‌తో పాటు మొత్తం 11 వస్తువులున్న కిట్‌లను అంచేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రపర్చడం ద్వారా ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో జిహెచ్‌ఎంసి పారిశుద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

ప్రజల ఆరోగ్యంలో ప్రధానపాత్ర పోషిస్తున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యం ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనిలో భాగంగానే 10 కోట్ల 8 లక్షల 30 వేల రూపాయల విలువైన పిపిఈ కిట్‌లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. పురుషులకు అందించే కిట్ విలవ రూ.5016 ఉండగా మహిళలకు అందించే కిట్ విలువ రూ. 4807 ఉందన్నారు. ఈ పిపిఈ కిట్‌లను 6496 మంది పురుషులకు 14279 మహిళలకు అందించినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News