Tuesday, April 30, 2024

కేంద్రంపై ప్రియాంక విమర్శలు

- Advertisement -
- Advertisement -

priyanka gandhi comments on covid Vaccines

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకగాంధీ విమర్శలు గుప్పించింది. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందన్నారు. కోవిడ్ టీకాల కొరతకు కేంద్రమే కారణమని ఆమె ఆరోపించారు. ప్రణాళిక లేమి వల్లే రెమిడెసివర్, ఆక్సిజన్ కొరత ఏర్పడిందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. గత 3 నెలల్లో భారత్ నుంచి 6 కోట్ల కోవిడ్ టీకాల ఎగుమతి చేశారన్నారు. జనవరి-మార్చి మధ్య భారత్ లో 3-4 కోట్ల మందికే టీకాలు వేశారని ప్రియాంక చెప్పారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఎగుమతి చేశారన్నారు. ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంలో ప్ర‌పంచంలోనే భార‌త్‌ది మొదటి స్థానం అయిన‌ప్ప‌టికీ, కొర‌త ఎదుర్కొంటున్నామని ప్రియాకం ప్రశ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, ప్ర‌ణాళిక లోప‌మే అన్నింటికీ కార‌ణ‌మ‌ని ఫైర్ అయ్యారు.

priyanka gandhi comments on covid Vaccines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News