అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి
ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలి
తెలంగాణ బతుకు పోరాటమే‘ బతుకమ్మ‘
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం
తెలంగాణ అమరులను స్మరించుకుంటూ పెద్దలకు బియ్యం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించడమే పెత్తరమాస రోజు అమరులకు బియ్యమిచ్చే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య అధ్యక్షతన గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు బియ్యమిచ్చే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ,యాదయ్య వంటి విద్యార్థుల బలిదానాల త్యాగఫలమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని అన్నారు. వారి త్యాగాలను, పోరాటాలను భవిష్యత్తు తరాలకు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 25వేల పెన్షన్ ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియను ప్రారంభించాలని ఈ సందర్భంగా కోదండరాం ప్రభుత్వానికి సూచించారు.
తెలంగాణ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బతుకు పోరాటమే బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి కార్మిక విభాగం కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, బిసి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ జస్వంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, ఆషప్ప, తెలంగాణ ఉద్యమకారులు ఆనందం ,బండి రమేష్, ఆర్‌టిసి జెఎసి లాలయ్య, జన సమితి నాయకులు భద్రగామ ఆంజనేయులు, హనుమంతు రెడ్డి, విజయ్ కుమార్, తిరుమల్, రవి కాంత్, బట్టల రామచందర్, బాలరాజు, జహీర్, మెరుగు శ్రీనివాస్ యాదవ్, జైపాల్ రెడ్డి, లక్ష్మణ్, సురేష్, రమేష్, హనుమంతు గౌడ్, మాణిక్యం, ఇస్మాయిల్, రసూల్, సుధాకర్, నాగభూషణం, యాదగిరి, కృష్ణ ,బల్వంతు ,రాజు, శేఖర్ మురళి అంజి తదితరులు పాల్గొన్నారు.
Also Read: నా కుటుంబ నుంచి నన్ను దూరం చేసిన వాళ్లని వదలను: కవిత