Tuesday, May 7, 2024

ప్రజా సంక్షేమం, అభివృద్ధియే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

బిచ్కుంద: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామ గ్రామాన మౌళిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్దియే ధ్యేయంగా ఎం కేసిఆర్ పాలన కొనసాగిస్తున్నారని జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే అన్నారు. బుధవారం బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బిచ్కుంద మండల కేంద్రంలో వికలాంగుల పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్లను 3016 నుంచి రూ. 4016 పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం యావత్ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, 24 కరెంట్, ఇలా అనేక పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసిఆర్‌దేనన్నారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరపున సీఎం కేసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, సీఈవో సాయాగౌడ్, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ నాల్చెర్ రాజు, పిట్లం నాయకులు విజయ్, నిజాంసాగర్ నాయకులు దుర్గారెడ్డి, వాజీద్ అలీ, గంగారెడ్డి, జుక్కల్ నాయకులు నీలు పటేల్, ఆయా మండలాల నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News