Friday, May 3, 2024

తినేంత పప్పు పండట్లే !

- Advertisement -
- Advertisement -

Pulses product not sufficient in Telangana

 

రాష్ట్రంలో ఏడాదికి 7.74 లక్షల టన్నులు అవసరం
ఉత్పత్తి 5.29 లక్షల టన్నులే… నియంత్రిత సాగులో పప్పు పంటలకు ప్రాధాన్యం
తక్కువగా దిగుబడులు.. పెంచేందుకు కానరాని ప్రణాళికలు
తెలంగాణలో 16 జిల్లాల్లో దిగుబడి జాతీయ ఉత్పాదకత కంటే తక్కువ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా పప్పులు పండటం లేదు. సగటు వినియోగం ఆధారంగా 7.74లక్షల టన్నులు అవసరం కాగా ప్రస్తు తం 5.29 లక్షల టన్నుల వరకే ఉత్పత్తి వస్తోంది. దీంతో వినియోగం ఆధారంగా పప్పు పంటలను పండించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నియంత్రిత సాగులో కంది, పెసర్లు, మినుముల సాగును పెంచింది. పోషకాహార విలువలు అధిక మొత్తంలో కలిగి న పప్పు దినుసుల సాగు, దిగుబడి నానాటికి తగ్గిపోతుం ది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని 316 జిల్లాల్లో పప్పు పంటలను సాగు చేస్తుండగా 259 జిల్లాల్లో దిగుబడులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటంపై కేంద్ర వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మన తెలంగాణలో 16 జిల్లాల్లో జాతీయ ఉత్పాదకత కంటే తక్కువగా ఉన్న ట్లు వెల్లడించింది. సగటున జాతీయ ఉత్పాదకత హెక్టారు కు (రెండున్నర ఎకరాలకు) గాను 7.86 క్వింటాళ్లుగా ఉంది. అంటే రాష్ట్రంలో హెక్టారు విస్తీర్ణంలో పప్పు పంట లు సాగు చేస్తే 7 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. పశ్చిమ బెంగాల్, మిజోరం, ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో దిగుబడి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.

రాష్ట్రంలో 2.45 లక్షల టన్నుల లోటు

వాస్తవానికి పేదలకు పప్పు దినుసులే ప్రధాన పౌష్టికహా రం. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మన రాష్ట్రంలో పప్పుధాన్యాల అవసరం, వాటి ఉత్పత్తిపై కూడా నివేదిక తయా రు చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం సాగవుతున్న పప్పు ధాన్యాలు, వాటి ఉత్పత్తి రాష్ట్ర అవసరాలతో పోలిస్తే 2.45 లక్షల టన్నుల లోటు ఉంది.ఒక్క రోజుకు పప్పు దినుసుల తలసరి వినియోగం 60 గ్రాములుగా పేర్కొన్నారు. ఏడాదికి ఒక మనిషికి 22 కిలోల పప్పు తింటున్నారు. ఈ లెక్క న 3.51 కోట్ల రాష్ట్ర జనాభాకు 7.74 లక్షల టన్నులు అవసరమౌతాయని తేల్చారు. ప్రస్తుత పప్పుదినసులు సాగు విస్తీర్ణం ప్రకారం 5.29 లక్షల టన్నులు ఉత్పత్తి ఉండగా, 2.45 లక్షల టన్నులు 46 శాతం లోటుగా ఉంది. అందు లో భాగంగానే కందులు గతం కంటే ఐదు లక్షల ఎకరా లు అదనంగా 12.31 లక్షల ఎకరాల్లో, పెసర్లు 1.88 లక్షల ఎకరాల్లో, మినుములు 54 వేల ఎకరాల్లో సాగును ప్రతిపాదించింది. ఇప్పటికే కొంత విస్తీర్ణంలో రైతులు సాగు ప్రారంభించారు.

దిగుబడులు పెరిగేందుకు చర్యలేవి !

పప్పు దినుసుల తలసరి లభ్యత 1965లో 75 గ్రాములుగా ఉంది. ఏటా జనాభా 1.9శాతం పెరుగుతుండగా మరొకవైపు పప్పుధాన్యాల విస్తీర్ణం, ఉత్పత్తి ఆ దామాషాలో పెరగడం లేదు. గత 6-7 సంవత్సరాలుగా పప్పుధాన్యాలను పండించడానికి రైతులు సుముఖత చూపడం లేదు. కారణం పంట గిట్టుబాటు కాకపోవడమే. అలాగే ఎకరాకు 3- క్వింటాళ్ళకు మించి దిగుబడులు రావడం లేదు. ఉత్పత్తి ఖర్చుకు తగినట్టు ఆదాయం రాకపోవడం తో ఈ పంటను మార్చి వేరే పంటల దృష్టిసారిస్తున్నారు. నెలకు 3 వర్షాలు పడితేనే పప్పు ధాన్యాలు పండుతాయి. వర్షాలు తగ్గడంతో, కరువు పరిస్థితులు ఏర్పడడం వలన కూడా ఈ పంటను తగ్గించి వేశారు. దీనికి బదులుగా భూములు పడావగా పెట్టడం, లేదా పత్తి పంట వైపు దృష్టిసారిస్తున్నారు. మన దేశం ఏటా 30 లక్షల నుంచి 35 లక్షల టన్నులు పప్పు దినసులు దిగుమతి చేసుకుంటోం ది. 2025 నాటికి 3 కోట్ల టన్నుల పప్పుధాన్యాలు అవసరమౌతాయని నిపుణుల అంచనా.

పప్పు దినుసులు వినియోగం

తలసరి అవసరత రోజుకు (గ్రాముల్లో) 60
సంవత్సరానికి (కిలోలు) 22
3.51 కోట్ల జనాభాకు ( లక్షల టన్నుల్లో) 7.74
ప్రస్తుత ఉత్పత్తి ( లక్షల టన్నుల్లో) 5.29

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News