Sunday, May 5, 2024

మళ్లీ తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం

- Advertisement -
- Advertisement -
Puri Jagannath Temple Reopens
జనవరి 3 నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం

పూరి: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడిన ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం బుధవారం భక్తుల కోసం మళ్లీ తెరుచుకుంది. ఉదయం 7 గంటలకు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆలయ అర్చకులు, సేవకులు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే ఆలయంలోనికి అనుమతించారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ వైష్ణవాలయంలోకి భక్తులను ఇంతకాలం అనుమతించకపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. మొదటి మూడు రోజులు(డిసెంబర్ 23, 24, 25) ఆలయ అర్చకులు, సేవకులు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నట్లు పూరి జిల్లా కలెక్టర్ బల్వంత్ సింగ్ తెలిపారు. పూరీ నివాసులకు మాత్రం డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం వరకు ఆలయంలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. నూతన సంవత్సర భక్తుల రద్దీ సందర్భంగా జనవరి 1, 2 తేదీలలో ఆలయాన్ని మూసివేసి జనవరి 3వ తేదీ నుంచి భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పిస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News