Sunday, April 28, 2024

భారత షట్లర్లకు మంచి ఛాన్స్!

- Advertisement -
- Advertisement -

PV Sindhu and Sai Praneeth get easy draw in Olympics

సింధు, ప్రణీత్‌లకు అనుకూల డ్రా

న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత షట్లర్లకు అనుకూల డ్రా లభించింది. దీంతో స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సాయి ప్రణీత్‌లు సులువుగా క్వార్టర్ ఫైనల్ చేరుకునే ఛాన్స్ దక్కింది. అయితే విపరీత పోటీ ఉండే ఒలింపిక్స్‌లో ఏ క్రీడాకారుడిని కూడా తక్కువ అంచన వేయలేం. ఇతర టోర్నీలతో పోల్చితే ఒలింపిక్స్ అనేది దేశానికి సంబంధించిన క్రీడలు. దీంతో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులు తమ దేశం కోసం సర్వం ఒడ్డి పోరాడడం అనవాయితీగా వస్తోంది. ఇదే విషయాన్ని భారత అగ్రశ్రేణి షట్లర్ సింధు కూడా స్పష్టం చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి ప్రత్యర్థి బలమైన ఆటగాడే అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగక తప్పదని అభిప్రాయపడింది. తనతో పాటు ఇతర భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్‌లో సులువైన డ్రా లభించడం కాస్త ఊరట కలిగించే అంశమేనని పేర్కొంది. అయితే ఆడే ప్రతి మ్యాచ్‌లో వంద శాతం సామర్థాన్ని ప్రదర్శించినప్పుడే సత్ఫలితాలు ఉంటాయని తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్‌లో సింధుకు సులువైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్‌లో సింధు గ్రూప్‌జె నుంచి బరిలోకి దిగనుంది. ఈ గ్రూప్‌లో ప్రపంచ 34వ ర్యాంక్ క్రీడాకారిణి చెంగ్ ఎంగన్ యి (హాంకాంగ్), ఇజ్రాయిల్‌కు చెందిన 58వ ర్యాంక్ క్రీడాకారిణి సెనియా పొలికర్పోవాలు ఉన్నారు. వీరితో పోల్చితే ర్యాంకింగ్స్‌లో సింధు చాలా మెరుగైన స్థానంలో ఉంది. సింధు ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో ఏడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతున్న సింధు ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. కిందటి ఒలింపిక్స్ తర్వాత సింధు ఆట గాడి తప్పిందనే చెప్పాలి. ఆడిన ప్రతి టోర్నమెంట్‌లోనూ పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. చాలా టోర్నీల్లో కనీసం క్వార్టర్ ఫైనల్ దశను కూడా దాటడం లేదు. అంతేగాక కిందటి ఏడాది నుంచి కరోనా దెబ్బకు పలు అంతర్జాతీయ టోర్నీలు రద్దు కావడం కూడా సింధుకు ప్రతికూల అంశంగా మారింది.

అయితే ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడల్లో సింధుకు అసాధారణ పోరాట పటిమను కనబరుస్తుడడం సానుకూలం పరిణామంగా చెప్పొచ్చు. ఇక పురుషుల సింగ్సిలో సాయి ప్రణీత్‌కు కూడా అనుకూలమైన డ్రా లభించిందనే చెప్పాలి. ప్రణీత్ ప్రస్తుతం సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానలో కొనసాగుతున్నాడు. అతను బరిలోకి దిగనున్న గ్రూప్‌డిలో అతనికంటే తక్కువ ర్యాంక్‌లు కలిగిన ఆటగాళ్లు ఉండడం కలిసివచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రణీత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరిస్తే సులువుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరడం కష్టమేమీ కాదు. పురుషుల డబుల్స్ విభాగంలో అగ్రశ్రేణి జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్‌లకు మాత్రం కఠినమైన డ్రా ఎదురుకానుంది. వీరు ప్రాతినిథ్యం వహించనున్న గ్రూన్‌లో వరల్డ్ నంబర్‌వన్ జంటతో పాటు ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఉంది. వీరిని ఓడించి ముందుకు సాగడం పదో సీడ్ భారత జంటకు అంత తేలికకాదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News