Sunday, April 28, 2024

మామిడి ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్

- Advertisement -
- Advertisement -

స్కాన్‌ద్వారా క్షణాల్లో సమస్త సమాచారం
తోటల వద్దే ధరల నిర్ణయం
దళారీ వ్యవస్థకు చెక్

QR Code given to Mangos

 

మనతెలంగాణ/హైదరాబాద్: మామిడి ఉత్పత్తులకు కూడా క్యూఆర్ కోడ్ అమలు చేయబోతున్నారు. మామిడి కాయలకు సంబంధించి కాయ రకం , రైతుల తోట వివరాలు , కాయలో పోషక విలువలు, కాయలు చెట్లనుంచి తెంపినది మొదలు కాయలను మగ్గించటం, పక్వానికి వచ్చే వరకూ అనుసరించే ప్రక్రిలకు సంబంధించిన సమస్త సమాచారం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటం ద్వారా క్షణాల్లో బయటపడనుంది.మార్కెట్‌లో వ్యాపారులు ఒక రకం మామిడి పండ్లను చూపి మరో రకం పండ్లలా భ్రమింపచేసే అవకాశాలకు క్యూఆర్‌కోడ్‌తో చెక్ పడనుంది. వినియోగదారులు కోరుకున్న మామిడి ఉత్పత్తులనే ఏరి కోరి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రపంచ స్థాయిలో అమలులో ఉన్న ఆధునాతన క్యూఆర్‌కోడ్ సాంకేతికతను తొలిసారి తెలంగాణ రైతులకు కూడా అందించబోతున్నారు. మార్కెటింగ్‌లో మెరుగైన విధానాలను అనుసరించటం ద్వారా ఉద్యాన రైతులు తాము పండించిన పంటకు ఆశించిన దానికంటే అధిక ఆదాయం పొందే అవకాశాలు మెరుగుపడనున్నాయి. కల్గుడి డిజిటల్ ప్లాట్‌ఫాం ఇందుకు అవకాశం ఏర్పచనుంది. రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ వేసవి సీజన్‌లోనే ప్రాధిమికంగా మామిడి రైతులను ప్రోత్సహించాలన్న లక్షంతో రాష్ట్రంలో 10వేల టన్నుల మామిడి ఉత్పత్తులను నేరుగా సేకరించి కల్గుడి డిజిటిల్ ఫ్లాట్‌ఫాం ద్వారా నేరుగా వినియోగదారులకు , వ్యాపారులకు, ఎగుమతి దారులకు సరఫరా చేయనుంది.రాష్ట్రంలో 3.06లక్షల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి.

వీటిద్వారా ఈ ఏడాది సుమారు 12లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి కానుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో మామిడి తోటలు అధికంగా నాగరకర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, ఖమ్మం, మహబూబాబాద్ , జగిత్యాల్ , రంగారెడ్డి, మంచిర్యాల్ జిల్లల్లోనే సాగులో ఉన్నాయి.ఈ జిల్లాల్లోని రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల నుండి మామిడి కాయలను సేకరించి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో వినియోగదారులకు, వ్యాపారులకు , ఎగుమతి దారులకు డిజిటల్ ఫ్లాట్‌ఫాంల ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లను ప్రోత్సహించనున్నారు. కల్గుడి సంస్థ సిబ్బంది మామిడి తోటల సాగు జిల్లాల్లో పర్యటించి మామిడి తోటలను సందర్శిస్తుంది. తోటల్లో మామిడి కాలయ నాణ్యతను బట్టి రైతుల సమక్షంలో తోటలోనే కాయల ధరలను నిర్ణయించి అక్కడే కొనుగోలు చేసి నేరుగా వినియోగదారులకు , వ్యాపారులకు సరఫరా చేస్తారు.

దళారి వ్యవస్థకు అడ్డుకట్ట

తోటల వద్ద కొనుగోలు చేసిన మామిడి ఉత్పత్తులకు నిర్ణయించిన ధరలను పారదర్శకంగా చెల్లించనున్నారు. తోటల వద్దనే ధరలు నిర్ణయించనున్నందున అంగీకారం ప్రకారం రైతులకు చెల్లింపులు చేయనున్నారు. ఈ విధానం ద్వారా మద్యదళారుల వ్యవస్థనుంచి ఎదురయ్యే పలు రకాల సమస్యలనుంచి రైతులకు ఉపశమనం కలుగనుంది. కల్గుడి సిబ్బంది మామిడి తోటల్లో కాయల కొత విధానం, కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొండాలక్ష్మన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News