Tuesday, September 10, 2024

‘రాధే కృష్ణ’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

ఎస్‌వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్‌ఎస్ సైదులు హీరోగా భ్ర మరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎంఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వ స్తున్న సినిమా రాదే కృష్ణ. ఈ సినిమాని తెలుగు, బంజారా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రా ండ్‌గా జరిగింది.

ఈ కార్యక్రమంలో ము ఖ్య అతిథులుగా నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, రామ్ తాళ్లూరి, హీరో సోహెల్, ఆ టో రాంప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ సినిమా పూర్తయింది. తనికెళ్ల భరణి వాయిస్‌తో టీజర్‌కి ఒక కొత్త ఫీల్ వచ్చిందని అన్నారు. నిర్మాత ఊడుగు సుధాకర్ మాట్లాడుతూ ప్రేక్షకులు ఈ సినిమాని మ ంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాన న్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్ సైదులు, భ్రమరాంబికా, రాజేష్ మాచర్ల ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News