Saturday, April 27, 2024

వచ్చే ఏప్రిల్‌కల్లా మొత్తం 36 రాఫెల్

- Advertisement -
- Advertisement -
Rafale jets to be completed by April 2022
విమానాల సరఫరా పూర్తి, ఫ్రాన్స్ రాయబారి వెల్లడి

ముంబయి: అయిదేళ్ల క్రితం ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు భారత్‌కు 30 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేశామని, మిగతా ఆరు విమానాలను వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా సరఫరా చేస్తామని మన దేశంలో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయెల్ లెనయిన్ గురువారం ఇక్కడ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా వారాల తరబడి ఫ్యాక్టరీలు మూతపడినప్పటికీ సకాలంలో విమానాలను సరఫరా చేయగలగడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని ఆయన చెప్పారు. ‘ఫ్రాన్స్‌లో కార్మిక బృందాలు ఎక్కువ సమయం పని చేస్తున్నారు. రాత్రిపూట, కొన్ని సందర్భాల్లో వారాంతాల్లో కూడా వారు పని చేయడం వల్ల ఇచ్చిన హామీని నెరవేర్చగలుగుతున్నాం. విశ్వాసం అంటే ఇదే’ అని ఆయన అన్నారు. ఇప్పటివరకు 29 యుద్ధ విమానాలను భారత్‌కు పంపించగా, 30 విమానాలను డెలివరీ చేశాం.

వచ్చే ఏప్రిల్ నాటికి మొత్తం 36 విమానాలను అందించాలన్న టారెట్‌కు చేరుకుంటాం’ అని లెనయిన్ పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు భారత్, ఫ్రాన్స్ దేశాలు దశాబ్దాలుగా రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాయని ఆయన చెప్పారు.36 రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా కోసం 2016లో భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. గత ఏడాది జులై 29న మొదటి విడతగా అయిదు రాఫెల్ విమానాలు భారత్‌కు వచ్చాయి. హిందూమహాసముద్రంలో ఫ్రాన్స్ శాశ్వత ఉనికిలో భాగంగా ఆ దేశ నౌకాదళానికి చెందిన విమాన విధ్వంసక నౌక ‘ చెవలియర్ పౌల్’ గురువారం ముంబయికి వచ్చిన సందర్భంగా లెనయిన్ ఇక్కడికి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News