Sunday, May 5, 2024

బిజెపియేతర రాష్ట్రాలను కేంద్రం నియంత్రించాలనుకుంటోందా?: రాఘవ్ చద్దా

- Advertisement -
- Advertisement -
ఢిల్లీ ప్రభుత్వం నుంచి అన్ని అధికారాలను లెఫ్టినెంట్ జనరల్‌కు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై ఆప్, కేంద్రానికి మధ్య రచ్చ తీవ్రస్థాయికి చేరుకుంది.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ధర్మ సందేహాన్ని వ్యక్తం చేశారు. బిజెపియేతర ప్రభుత్వం పాలించే ఏదైనా రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తెచ్చే ప్లాన్ చేస్తుందా? అని ప్రశ్నించారు. పరిపాలనపరమైన అంశాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ‘ఓవర్ రూల్’ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన అంశాలను నిర్ణయిండంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తి విచక్షణాధికారం కల్పించారు.

‘తర్వాత ఏమిటి? బిజెపియేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం నుంచైనా దాని శాసనసభ్యత్వ అధికారం తొలగించబడి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబడే రాజ్యాంగ సవరణ?’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News