Friday, May 10, 2024

గుడిలోనికి రాకుండా అడ్డుకున్నారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

గౌహతి: దేవాలయంలోకి రాకుండా తనను అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ అస్సోంలోని నగావ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తనని అడ్డుకోవటానికి గల కారణం ఏంటని అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించాలనేది ప్రధాని మోడీ నిర్ణయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాను ఆలయాన్ని దర్శించుకోలేనంత తప్పు ఏం చేశానని ప్రశ్నించారు. ప్రార్థనలు చేయడానికి బతద్రవ సత్ర ఆలయానికి వచ్చానని, గొడవలు సృష్టించడానికి కాదని రాహుల్ హితువు పలికారు. జోడో యాత్ర మార్గం పునరాలోచించుకోవాలని రాహుల్‌కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉందని అస్సాం సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాంలోని 17 జిల్లాల మీదుగా రాహుల్ యాత్ర కొనసాగనుంది. 15వ శతాబ్ధిని చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ జన్మస్థలం బతద్రవ సత్ర.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News