Saturday, June 15, 2024

రామ మందిరం ఉత్సవానికి దళితులను ఆహ్వానించలేదేమి ?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతికి కూడా ఆహ్వానం లేదు
అది అవమానకరమే
యుపిలో న్యాయ్ యాత్రలో రాహుల్ విమర్శ

ప్రతాప్‌గఢ్ (యుపి) : అయోధ్యలో రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి దళితులను, వెనుకబడిన వర్గాలను, తుదకు రాష్ట్రపతిని కూడా ‘ఆహ్వానించకపోవడం’ వారిని అవమానించడమే అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు. తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రతాప్‌గఢ్‌లోని రాంపూర్ ఖల్సా అసెంబ్లీ నియోజకవర్గంలో లాల్‌గంజ్ ఇందిరా చౌక్‌లో జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ‘రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు పారిశ్రామికవేత్తలను, అమితాబ్ బచ్చన్‌ను ఆహ్వానించడం ద్వారా దేశంలోని 73 శాతం జనాభాకు ఎటువంటి ప్రాధాన్యమూ లేదనే సందేశాన్ని ప్రధాని మోడీ ఇచ్చారు’ అని ఆక్షేపించారు.

దేశంలో 73 శాతం ఉన్న దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలను బిజెపి ప్రభుత్వంఅలక్షం చేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. వారిని నిర్లక్షం చేసి పెట్టుబడిదారులకు ప్రాముఖ్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ‘రైతుల జేబులు కత్తిరించి సంపన్నుల జేబులను మోడీ నింపుతున్నారు. మతం పేరిట దేశంలో విద్వేషం వ్యాప్తికి కృషి చేస్తున్నారు. దేశంలోని యువతకు ఉపాధి, మహిళలకు భద్రత కల్పనలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ఇడి, సిబిఐ వంటి మోడీ ఏజెన్సీలో తోలుబొమ్మలుగా మారాయి. వాటిని ప్రతిపక్షాలను బెదరించేందుకు వాడుతున్నారు’ అని రాహుల్ దుయ్యబట్టారు. జిల్లా కేంద్రం మీదుగా లాల్‌గంజ్ ఇందిరా చౌక్‌కు చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ నాయకులు స్వాగతతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News