Sunday, April 28, 2024

ఎంఎంటిఎస్ రైళ్లు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Railway Department decided to launch MMTS trains in Hyderabad

 

హైదరాబాద్ : నగరంలో గతేడాది లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటిఎస్ రైలులో 5,10 రూపాయలకే ప్రయాణించేవారు. ఇప్పుడు రోజుకు దాదాపు రూ. 100 రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. అయితే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వారంలో నగరంలో ఎంఎంటిఎస్ రైలు సేవలు ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఎంటిఎస్ పున ప్రారంభంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు అత్యంత చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయం కలుగుతుందని కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నిబందనలు పాటిస్తూ ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తాయన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి ఎంఎంటిఎస్ సేవలను ప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News