Tuesday, April 30, 2024

రాగల 24 గంటల్లో తెలంగాణ, ఎపి సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Rainfall prediction for next 24 hours in India

హైదరాబాద్: రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సహా సిక్కిం, పశ్చిమ బెంగాల్, తూర్పు, ఆగ్నేయ బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తూర్పు, ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ, కర్ణాటకలో రాబోయే 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాల్లో మంచుతో కూడిన వర్షం పడనుందని ఐఎండి చెప్పింది. ఎగువ, మధ్య పర్వత ప్రాంతాల్లో హిమపాతం కురిసే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Rainfall prediction for next 24 hours in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News