- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: తూర్పు బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో సోమవారం రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -