Monday, April 29, 2024

మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రాగల మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. అనేక ప్రాంతాలలో వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, బేగంపేట, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News