Tuesday, May 7, 2024

కిసాన్ మహాపంచాయత్‌లలో పాల్గొననున్న రాకేష్ తికాయత్

- Advertisement -
- Advertisement -

Rakesh Tikait to Address Kisan Mahapanchayat

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా మద్దతును కూడగట్టేందుకు హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ వ్యాప్తంగా వచ్చే ఆదివారం నుంచి(ఫిబ్రవరి 14) నిర్వహించనున్న ఏడు కిసాన్ మహాపంచాయత్‌లలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 23న ముగియనున్న ఈ కిసాన్ పంచాయత్‌లు సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు భాగమని బికెయు మీడియా ఇన్‌చార్జ్ ధర్మేంద్ర మాలిక్ శుక్రవారం తెలిపారు. హర్యానాలోని కర్నల్, రోహతక్, సిర్సా, హిసర్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని అకోలా, రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలలో ఈ కిసాన్ మహాపంచాయత్‌లు జరగనున్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News