Saturday, April 27, 2024

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి టిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

TRS had emerged as unstoppable political forceమహబూబాబాద్: తెరాస పార్టీ అంటేనే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి అని, దేశంలో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఏటా 16 నుండి 18 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించి బీమా ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాకల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల రైతుల జోలికి వెళ్లొద్దని చెప్పినా కొన్ని చోట్ల అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటివి సహించేది లేదని అన్నారు. తెరాస పార్టీ సభ్యత్వ నమోదు నేటి నుండి ప్రారంభం అవుతున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ సభ్యత్వ నమోదు ప్రారంభించి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు లక్షంగా ముందుకు వెళ్తున్నామని, రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఇంకా కష్టపడి పని చేయాలని అన్నారు. ఈ 3 నెలలు పార్టీకి కార్యకర్తల నిరంతర సేవ అవసరమన్నారు. రెండేళ్లకోసారి రాష్ట్ర పార్టీ యావత్తు వార్డు దగ్గర నుంచి మొదలు పెట్టి రాష్ట్ర కమిటీ వరకు సభ్యత్వాన్ని పూర్తి చేసుకుంటామని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుని మార్చి నెలలో వార్డు కమిటీ నుండి రాష్ట్ర కమిటీ, ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, కార్యవర్గ ఎన్నిక ఉంటుందన్నారు. ఈలోగా సంస్థాగతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జడ్పి చైర్ పర్సన్ ఆంగోతు బిందు, తెరాస నేత బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News