Sunday, April 28, 2024

శర్వానంద్ కు బ‌ర్త్‌డే పార్టీ ఇచ్చిన రామ్ చరణ్..

- Advertisement -
- Advertisement -

Ram Charan gave birthday party to Sharwanand

యంగ్ హీరో శ‌ర్వానంద్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. శనివారం శ‌ర్వానంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్రవారం రాత్రి రామ్ చ‌ర‌ణ్‌.. శ‌ర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ‌ర్త్‌డే పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలనున శర్వానంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ పార్టీ ఇచ్చినందకు చ‌ర‌ణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక, శ‌ర్వా పుట్టినరోజు పురస్కరించుకుని ఈ యంగ్ హీరో నటిస్తున్న శ్రీకారం ట్రైలర్ ను యంగ్ హీరోలు వరుణ్ తేజ్, నాని, నితిన్ విడుదల చేశారు. ఈ మూవీతోపాటు స‌ముద్రం సినిమా నుంచి శర్వా లుక్ విుడుదల కాగా, ఆడాళ్లు మీకు జోహార్లు మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.‌

మరోవైపు, రామ్ చరణ్ రీసెంట్‌గా ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసి హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చాడు. మ‌రోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Ram Charan gave birthday party to Sharwanand

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News