Sunday, April 28, 2024

అభిమాని కుటుంబానికి రాంచరణ్ ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Ram Charan

 

హైదరాబాద్ : మెగాకుటుంబ వీరాభిమాని నూర్ భాయ్ కుటుంబసభ్యులకు రాంచరణ్ రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశారు. రాంచరణ్ ఈ మేరకు నూర్ భాయ్ కుటుంబసభ్యులను కలిసి చెక్కును అందజేశారు. నూర్ భాయ్ కుటుంబానికి పెద్ద కొడుకుకుగా ఉంటానని, ఆయన కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చరణ్ హామీనిచ్చారు. నూర్ ఆడపిల్లల వివాహానికి కూడా వస్తానని చెప్పారు. నూర్ భాయ్ ఇటీవల గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి, అల్లు అర్జున్ నూర్ భాయ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. నూర్ భాయ్ చనిపోయిన సమయంలో రాంచరణ్ విదేశాల్లో ఉన్నాడు. హైదరాబాద్ వచ్చిన తరువాత నూర్ భాయ్ కుటుంబసభ్యులను కలుస్తానని చెప్పిన మేరకు వారిని కలిశారు.

Ram Charan helps his fan family
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News