Tuesday, April 30, 2024

‘ఆచార్య’‌లో కీ రోల్ పోషిస్తున్నా: రామ్ చ‌ర‌ణ్

- Advertisement -
- Advertisement -

Ram Charan to play Key Role in Acharya movie

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘ఆచార్య’‌. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరు బర్త్ డే సందర్భంగా అగస్టు 22న విడుదలైన ఈ సినిమా పోషన్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై మ్యాట్నీ మూవీస్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై రాంచ‌‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ‘ఆచార్య‌’లో కీలక పాత్ర పోషిస్తున్నానని స్పష్టం చేశాడు.

”నాన్న‌ వల్లే నాకింత స్టార్ డ‌మ్ వ‌చ్చింది. ఇక, ఆయనతో క‌లిసి నటించే అవ‌కాశం వ‌స్తే.. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో నాన్న గెస్ట్ రోల్ లో క‌నిపించారు. అలాగే నాన్నా రీఎంట్రీ చిత్రం ఖైదీ నం 150లో నాన్న‌తో క‌లిసి డ్యాన్స్ చేశాను. నాన్న‌, నేను క‌లిసి నటించాలనేది అమ్మ క‌ల‌. ‘ఆచార్య’ సినిమాతో అమ్మ క‌ల నెరవేరబోతుంది’ అని రామ్ చరణ్ చెప్పాడు. కాగా, ఆచార్య చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

Ram Charan to play Key Role in Acharya movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News