Wednesday, May 22, 2024

అదే నాకు అభిమానులిచ్చే బహుమతి

- Advertisement -
- Advertisement -

Ram pothineni

 

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో తమ అభిమానులు, ప్రజలను ఆయా స్టార్ హీరోలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. హీరో రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి ఓ బహుమతిని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అదేంటంటే తన పుట్టిన రోజు నాడు సెలబ్రేషన్స్ లాంటివేమీ చేయకుండా ఇంటి పట్టునే ఉండాలని అభిమానులను ఆయన కోరాడు. నిజంగానే ఇది పెద్ద బహుమతిగానే భావించాల్సి ఉంటుంది. సాధారణంగా హీరోల పుట్టిన రోజు నాడు అభిమానుల హంగామా ఓ స్థాయిలో వుంటుంది. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకే తమ అభిమాన హీరో చెప్పినట్లు అభిమానులు నడుచుకోవాల్సిందే. ఇక రామ్ నటించిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News