Tuesday, May 14, 2024

‘అంతఃపురం’లో అందాల రాశీ

- Advertisement -
- Advertisement -

Rashi khanna acted in ‘Antahpuram’

 

సుందర్.సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా’అరణ్మణై 3’. హారర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ’అంతఃపురం’ పేరుతో తీసుకొస్తోంది గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్. రెడ్జైంట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేస్తున్నారు. తెలుగులో ‘చంద్రకళ’గా విడుదలైన ’అరణ్మణై’, ’కళావతి’గా విడుదలైన ’అరణ్మణై 2’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమిళంలో ’అరణ్మణై 3’కి మంచి స్పందనలభించింది. దీంతో ఈ సినిమా మీద తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అందాల తార రాశీ ఖన్నా ఇందులో నటించడం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఆమె రోల్, యాక్టింగ్ తమిళనాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పైగా రాశీ ఖన్నా నటించిన ఫస్ట్ హారర్ కామెడీ సినిమా ఇది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News