Sunday, May 5, 2024

పక్కా డి- గ్లామర్ పాత్రలో…

- Advertisement -
- Advertisement -

Rashmika mandanna acts In the role of D-Glamor

 

స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో సినిమా కాబట్టి దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాస మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన యంగ్ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో అసలు హీరోయిన్ రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

కానీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమాలో రష్మిక చిత్తూరు జిల్లా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. పక్కా డి- గ్లామర్ పాత్రలో ఆమె అలరించనుంది. అలాగే ఈ సినిమాలో రష్మిక పాత్ర ఓ బలమైన ట్విస్టు కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతోంది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా.. రష్మిక ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఓవైపు ‘పుష్ప’ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తోంది. మిషన్ మజ్ను అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News