Friday, April 26, 2024

కోలీవుడ్‌లో మరో జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

Rashmika mandanna

 

బెంగుళూర్ బ్యూటీ రష్మిక వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వరుసగా క్రేజీ స్టార్ల సరసన అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయింది. ఇటీవలే మహేష్‌బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన ‘భీష్మ’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ సినిమాలోనూ రష్మికనే హీరోయిన్. తెలుగులో ఇంకా మరిన్ని కమిట్‌మెంట్లు ఉన్నాయి. అయితే టాలీవుడ్‌లో ఇంత బిజీగా ఉన్నా కోలీవుడ్‌ని కూడా వదిలి పెట్టడం లేదు.

ఇప్పటికే ‘సుల్తాన్’ చిత్రంతో అక్కడ ఎంట్రీనిస్తోంది. ఇందులో కార్తీ సరసన రొమాన్స్ చేసింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈలోగానే రష్మికకు కోలీవుడ్‌లో మరో జాక్‌పాట్ తగిలింది. కార్తీ సోదరుడు, స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటీ. సూర్య కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ హరి ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

Rashmika mandanna acts with Surya
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News