Sunday, April 28, 2024

థియేటర్లలోనే ‘ఖిలాడి’..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన ‘ఖిలాడి’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ సినిమాను హవిష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ పతాకాలపై కోనేరు సత్యానారాయణ నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ‘ఖిలాడి’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోనేరు సత్య నారాయణ మాట్లాడుతూ- “ఖిలాడి సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. థియేటర్స్‌లో చూసి ప్రేక్షకులు ఆస్వాదించేలా ‘ఖిలాడి’ సినిమాను చిత్రీకరిస్తున్నాము. నిర్మాణ విలువల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు.

‘ఖిలాడి’ సినిమా కథ, కథనం, సాంకేతిక విలువలు అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్, రొమాన్స్, కథ, కథనం ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. అలాగే ఇటీవల ఇటీలీలో తీసిన యాక్షన్ సీక్వెన్సెస్ మరో హైలైట్. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, స్టంట్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకు అదనపు ఆకర్షణలు. సాంగ్స్ విడుదల గురించి త్వరలో వివరాలు వెల్లడించబోతున్నాం. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు.

Ravi Teja’s Khiladi Movie to release in Theaters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News